అక్టోబర్ 22 న విడుదల కాబోతున్న అక్కినేని అఖిల్ సినిమా మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి, అతను నటించిన మొదటి సినిమా గా అఖిల్ రాబోతూ ఉండడం తో అక్కినేని అభిమానులతో పాటు ఎన్ని సంవత్సరాల నుంచీ సినిమా రంగం మీద ఆసక్తి ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి గా అఖిల్ ని గమనిస్తున్నారు.
సరిగ్గా పదిహేను రోజులు అతని సినిమా విడుదల కి సమయం ఉండగా ఈ కీలక సమయం లో అఖిల్ సినిమా మీద ఫోకస్ ఇంకా రాలేదు. ప్రాచార కార్యక్రమాలు ఆడియో సమయం లో కాస్త హడావిడి గా కనిపించాయి కానీ తరవాత మాత్రం ఎక్కడ వారు అక్కడ సైలెంట్ అయిపోయారు. జనాల దృష్టి ఇప్పుడు మెల్లగా రుద్రమదేవి మీద తరవాత రాబోతున్న బ్రూస్లీ మీదకీ మళ్ళింది. ఈ రెండు సినిమాలూ విపరీతమైన హైప్ తో వస్తూ ఉండగా అఖిల్ సినిమా వాయిదా పడుతుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. టాలీవుడ్ లో నట వారసులు అందరూ దాదాపు హిట్ లు అందుకున్న వారే ఎన్టీఆర్ – నాగ చైతన్య లు మాత్రం ప్లాపులతో ఎంట్రీ ఇచ్చారు అందుకే ఇప్పుడు అఖిల్ సినిమా విషయం లో అంతా ఏమౌతుందో అని చూస్తున్నారు. ప్రొడ్యూసర్ నితిన్ సైతం సైలెంట్ గా ఉండడం వెనక అర్ధం ఏంటో అర్ధం కావడం లేదు.
మనకి అందిన సమాచారం ప్రకారం మాత్రం నాగార్జున సినిమా ని వాయిదా వేసుకోమని కోరుకుంటూ ఉండగా నితిన్ మరియూ అఖిల్ మాత్రం దానికి ఒప్పుకోవడం లేదట. అఖిల్ షూటింగులో చిట్టచివరిదైన అక్కినేని అక్కినేని పాట చిత్రీకరణ పూర్తయింది. ఇక ప్రమోషన్ కార్యక్రమాలపైనే దృష్టిసారించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
Post a Comment